
కాయగూరల దుకాణాలు తొలగించాలి
జయపురం: జయపురం ప్రధాన మార్గంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ఇరువైపులా కాయగూరల దుకాణాలను తొలగించాలని మున్సిపాలిటీ అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. స్వచ్ఛందంగా తొలగించకపోతే మున్సిపాలిటీ సిబ్బంది తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు జయపురం మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి ఆదేశాల మేరకు అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు రాజానగర్ కూడలి నుంచి దుకాణదారులకు స్పష్టం చేశారు.