
ఊరూరా జాతీయ జెండాల ర్యాలీ
రాయగడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థులు వంద మీటర్ల పొడవైన జాతీయ జెండాతో బుధవారం పట్టణంలో ఊరేగింపు చేపట్టి తమ దేశభక్తి చాటుకున్నారు. మద్యం మానుకోవాలంటూ చైతన్య ర్యాలీని నిర్వహించారు.
● పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శంకర కెరకెటా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్.ఉదయగిరిలో మంగరాజ్‌పూర్, కాశీనగర్ సమితిలో ఖరడ గ్రామాల్లో బ్లాక్ అధికారులు, స్వయం సహాయక గ్రూపులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఊరూరా జాతీయ జెండాల ర్యాలీ