
గ్రీవెన్స్‌సెల్‌కు 52 వినతులు
పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్ బ్లాక్ బూదర పంచాయతీలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫాల్గునీ మఝి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. కాశీనగర్, బూదర, గోరిబోంద, ఖండవ పంచాయతీల నుంచి మొత్తం 52 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 28, గ్రామ సమస్యలు 23 ఉన్నాయి. ముఖ్యంగా పీఎం ఆవాస్ యోజనా, సామాజిక పింఛన్లు, ఉపాధి పనులపై అభియోగాలు అందాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఏడీఎం మఝి ఆదేశించారు. కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, బీడీవో డంభుధర మల్లిక్, ఇతర అధికారులు హాజరయ్యారు.
పాము కలకలం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో సోమవారం పాము కలకలం రేపింది. ముఖ్యమంత్రి విచారణ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరీక్షిస్తున్న ప్రాంగణం పైకప్పు నుంచి పాము కిందకు జారింది. సురక్షితంగా దానిని తరలించేందుకు స్నేక్ హెల్ప్ లైన్ కార్యదర్శికి ఫోన్ చేయడంతో సువేందు మల్లిక్ సకాలంలో ఘటనా స్థలం చేరి పామును అదుపులోకి తీసుకున్నాడు. పసుపుపచ్చని రంగులో ఒక అడుగు పొడవు ఉన్న ఈ పాముని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

గ్రీవెన్స్‌సెల్‌కు 52 వినతులు