
అడ్డదారిలో అధికారం
● బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధ్వజం
రాయగడ: బీజేపీ అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకుందని, ఆ పార్టీని ప్రజలు ఎన్నడూ క్షమించరని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత అన్నారు. వివిధ రాష్ట్రా ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను చోరీ చేసి అడ్డగొలుగా గద్దెనెక్కారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలన్నారు. రాయగడ కాంగ్రెస్ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ అవినీతి, అసమర్థత పాలనపై దుమ్మె త్తిపోశారు. ఎన్నికల కమిషన్‌ను కీలుబొమ్మగా మార్చుకుని, ఓట్లు చోరీ చేసి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సంపూర్ణ మద్దతు బీజేపీకి లేకపోతే గత ఎన్నికల్లో మరింత మెజార్టీతో గెలిచేవారమన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకపొతే ఆందోళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ప్రధాన కార్యద ర్శి శంకర్షన్ మంగరాజ్, నాయకులు పాల్గొన్నారు.