
103 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యయ గ్రీవెన్స్ నిర్వహించారు. సమితి ప్రజలు తమ సమస్యలను వినతుల ద్వారా తేలియజేశారు. మొత్తం 103 వినతలును కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఇదే తొలి పర్యటన. ఈ సమితిలో జరిగిన అభివృద్ధి పనులు గూర్చి, జరగాల్సిన అభివృద్ధి పనుల గూర్చి ఉద్యోగులతో చర్చించారు. వినతలును పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ సోభరో, తదితరులు పాల్గొన్నారు.