
ప్రతి ఇంటికీ జాతీయ జెండా పంపిణీ
పర్లాకిమిడి: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్క రించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకూ ప్రతి ఇంటిమీద త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిషన్ శక్తి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఉచితంగా త్రివర్ణ పతాకం అందజేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మిషన్ శక్తి ఽఅధికారి టిమోన్ బోరా, జిల్లా సాంస్కృతిక శాఖ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సునారాం సింగ్, ఉద్యానవనాలు శాఖ ఉపసంచాలకులు సుశాంత రంజన్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పతాక వితరణ కార్యక్రమంలో పాల్గొని లక్ష త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఏడు మండలాల్లో పనిచేస్తున్న స్వయం సహాయక గ్రూపులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ జాతీయ జెండా పంపిణీ