
పోరాటాలతోనే హక్కుల సాధన
జయపురం: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి బిజయ జెనా అన్నారు. సోమవారం స్థానిక యాదవ భవనంలో సంఘ అధ్యక్షుడు నళినీకాంతరథ్ అధ్యక్షతన సమావేవం జరిగింది. బిజ య జెన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెనా మాట్లాడుతూ ఈపీఎఫ్ పెన్సనర్లు నెలకు రూ.9 వేల పెన్షన్ కోరటం న్యాయసమ్మతమన్నారు. పీఎఫ్ నిధి నుంచి వచ్చే వడ్డీని వారికి పెన్షన్‌గా ఇస్తున్నారన్నారు. నెలకు రూ.9 వేల పెన్షన్‌ను మంజూరు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై వామపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తూనే ఉన్నారని వెల్లడించారు. ఇతర పార్టీల ఎంపీలు, కొంత మంది బీజేపీ ఎంపీలు కూడా ఈపీఎఫ్ పెన్సనర్ల డిమాండ్‌ను సమర్థిస్తున్నారని వెల్లడించారు. అయినా వారి డిమాండ్‌పై కేంద్రం ప్రభు త్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చేంత వరకు పోరాటం సాగించాలన్నారు. భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘ నేతలు జి.ప్రకాశరావు, ఎ.ఎస్.రాజు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి, బసంత బెహర, ఎస్.కె. ప్రధాన్, కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి, తదితరులు పాల్గొన్నారు.