మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో చైతన్య రథాన్ని ఆయన జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సచేతన రథం ద్వారా జిల్లాలోని సమగ్రంగా అన్ని సమితి కేంద్రాలు, కాశీనగర్ ఎన్‌ఏసీ, పురపాలక పరిధిలో ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచారం జూన్ 24 వరకు చేపట్టనున్నట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తెలియజేశారు. కార్యక్రమంలో ఏడీఎం ఫాల్గుణ మఝి, సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్, ఎస్‌ఐ మఝి శోబోరో, నోడల్ ఇన్‌స్పెక్టర్ మోనూ ఆయాల్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


