ఆవాస్ యోజనపై అవగాహన
రాయగడ: పట్టణంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–2.0 కార్యక్రమంపై శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ సమావేశం హాల్‌లో చైతన్య కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికా రి అక్షయ కుమార్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ ఛైర్మన్ శుభ్రా పండలు పాల్గొన్నా రు. రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలొ ప్రారంభమైన ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలొ నివిసిస్తున్న అర్హులైన అందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలొ విలీనం చేసి వారు ఆ పథకం ద్వారా లబ్దీపొందాలన్న ఉద్దేశ్యంతొ ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు మున్సిపాలిటీ పరిధిలొ గల 24 వార్డుల్లొ గల కౌన్సిలర్‌లు వారి వారి ప్రాంతాల్లొ గల అర్హులైన వారిని పథకంలొ చేర్పించేందుకు సహకరించాల్సి ఉంటుందని అన్నారు.


