
నబరంగ్‌పూర్‌లో సినిమా చిత్రీకరణ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో దూరదర్శన్ వారు నిర్మిస్తున్న ఒడియా చలన చిత్రం ఖాలీ హండి నిర్మాణం పూర్తిచేసుకుంది. మంగళవారం జిల్లా కేంద్ర పరిసర గ్రామాల్లో ముగింపు షాట్‌లు చిత్రీకరించారు. ఒక అమాయక గిరిజనుడు సమాజంలో వివిధ సమస్యలతో పోరాడి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో ఈ చిత్రంలో చూపిస్తారు. గతంలో 6 దూరదర్శన్ చిత్రాలకి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ పట్నయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిల్లాకి చెందిన స్థానిక కళాకారులు జితేంద్ర పరిచా, జితేంద్ర కుమార్ చౌదరి, ప్రకాష్ చంద్ర బారిక్, తదితరులు నటించారు.
త్రిశక్తి కల్చరల్ అసోసియేషన్ ఈ సినిమాను నిర్మించింది.

నబరంగ్‌పూర్‌లో సినిమా చిత్రీకరణ