
రోడ్డెక్కిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనం పెంచాలని, వేధింపులు ఆపా లని డిమాండ్ చేస్తూ వారంతా సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు డచ్ భవనం వద్ద సమావేశం నిర్వహించి ధర్నా చేశారు. ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సీఎం, డిప్యూటీ సీఎంలు మోసం చేశారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ల ను ఉద్యోగులుగా గుర్తించడం లేదని, 2016 నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయన్నారు. చెప్పిన పనులు చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నార ని ఆరోపించారు. మరో పది రోజుల్లో తమ సమస్య లు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామన్నా రు. ఈ నెల 16 నుంచి దశల వారీగా అధికారులకు తమ గోడు వినిపిస్తున్నామని, ఈ నెల 28 నుంచి విధులను పూర్తిగా బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, పి.రామస్వామి, ధర్మారావు, సూర్యచంద్ర, పెద్ద ఎత్తున ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
● 28 నుంచి సమ్మెకు సిద్ధం