జయపురంలో ఆగని దొంగతనాలు
జయపురం: జయపురం లింగరాజ్ నగర్ ప్రాంతంలో రుద్రాక్ష నగర్ 13 వ లైన్‌లో ఉంటున్న తపన మహాపాత్రో ఇంటిలో బంగారు, వెండి నగలు దోచుకుపోయినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి వెల్లడించారు. తపన మహాపాత్ర రాయగడలో పని చేస్తున్నారు. అతడి భార్య పిల్లలు జయపురం రుద్రాక్షనగర్ ఉంటున్నారు. ఈ నెల 27వ తేదీన ఇంటికి తాళాలు వేసి మహాపాత్ర భార్య పిల్లలతో భర్త వద్దకు రాయగడ వెళ్లింది. ఇంటికి తాళాలు వేసి ఉండటం చూసిన దుండగులు ఇంటిలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని శుక్రవారం రాత్రి ఇంటి వెనుక వైపుగల గోడ పై నుంచి ఇంటిలో ప్రవేశించి బీరువా తాళాలు విరిచారు. బీరువా లోపల గల బంగారు నగలు, వెండి వస్తువులు విలువైన వస్తువులు దోచుకు పోయారు. మహాపాత్రో ఇంటి పక్కన ఉంటున్న వారు శనివారం మహాపాత్రో ఇంటిలో దొంగతనం జరిగినట్లు తెలుసుకొని మహాపాత్రోకు తెలియ జేశారు. వెంటనే మహాపాత్రో రాయగడ నుంచి జయపురం వచ్చి ఇంటిలో దొంగలు ఏయే వస్తువులు దొంగిలించారో పరిశీలించి జయపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండున్నర తులాల బంగారం, అర కిలో వెండి వస్తువులు రెండు వాచీలతో పాటు కొన్ని విలువైన వస్తువులు దొంగిలించారని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
జయపురంలో ఆగని దొంగతనాలు


