జయపురం: జయపురం సదర్ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నట్లు కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపారు. స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించబడిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సదర్ పోలీసులు జయపురం సమితి కంజాయి మాలిగుడ ప్రాంతంలో సోమవారం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో 4 కార్లు అతివేగంగా బొయిపరిగుడ వైపు నుంచి వస్తున్నాయి. దీంతో అనుమానం వచ్చిన పెట్రోలింగ్ సిబ్బంది వాటిని ఆపాలని ప్రయత్నించారు. అయితే వారు కార్లు ఆపకుండా పెట్రోలింగ్ జరుపుతున్న పోలీసు సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులు ఆ కార్లును వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 కార్లలో ఉన్నటువంటి 8 మందిని అరెస్టు చేశారు. అలాగే కార్లలో తీసుకెళ్తున్న 340.400 కేజీల గంజాయి, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, 5 నుబాఎమ్యూనేషన్స్, 10 సెల్‌ఫోన్లను సీజ్ చేశామన్నారు. అరైస్టెనవారిలో ఉమ్మిరి గ్రామానికి చెందిన రంజిత్ బాగ్, కార్తీక్ బాగ్, కర్ణ హరిజన్, రబీంద్ర బారిక్‌లు ఉన్నారు. వీరిపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. అలాగే మిగతావారు గౌతమ్ బాగ్, రవీంద్ర సామల్, సోను మంగూరియ, రాహుల్ కుమార్‌లుగా పేర్కొన్నారు. సమావేశంలో జయపురం ఎస్డీపీవో కావ్యపే పార్థసారధి తదితరులు ఉన్నారు.
భారీగా గంజాయి పట్టివేత