పర్లాకిమిడి: విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం(విశాఖ) తరఫున నిర్వహించిన అంతర్రాష్ట్ర కార్టూన్స్ పోటీలలో పర్లాకిమిడి (ఒడిశా) కు చెందిన కార్టూనిస్టు శేఖర్‌బాబుకు ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు వచ్చింది. విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఆదివారం జరిగిన బహుమతి ప్రదాన ఉత్సవంలో ప్రముఖ సాహితీవేత్త కావూరి సత్యవతి ముఖ్యఅతిథిగా పాల్గొని వేదికపై శేఖర్‌బాబుకు మెమొంటో, రూ.1000లు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం అధ్యక్షులు పి.వి.రామశర్మ, యస్.లక్ష్మణరావు (లాల్), టి.రాజేంద్రబాబు, కె.బి.ఎన్.కళాశాల ప్రిన్సిపల్ డా.క్రిష్ణవేణి, క్రియేటివ్ కల్చరల్ కమిషన్, డైరక్టర్ ఆర్.మల్లి కార్జున రావు, కార్టూన్ పోటీల నిర్వాహకులు కె.వి.వి.సత్యన్నారాయణ, హాస్యానందం ఎడిటర్ రాము పండా తదితరులు పాల్గొన్నారు.