పర్లాకిమిడి: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జైల్ రోడ్డులోని దేవగిరి రేంజ్ కార్యాలయం నుంచి ఒక చైతన్య ర్యాలీని డీఎఫ్‌ఓ సన్నీ ఖోఖర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మీదుగా హైస్కూల్, రాజవీధి మీదుగా ఫారెస్టు కార్యాలయం వరకూ సాగింది. అనంతరం జిల్లా అటవీ డివిజనల్ శాఖ కార్యాలయంలో ఒక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా పాల్గొని మాట్లాడారు. గజపతి జిల్లాలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలు రక్షించాలని, అటవీ సంపదను మనం కాపాడుకోవాలని ఎస్పీ జె.ఎన్.పండా సూచించారు. డీఎఫ్‌ఓ సన్నీ ఖోఖర్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఏసీఎఫ్ అరుణ్ కుమార్ సాహు, ఏడీఎఫ్ షైన్‌శ్రీ దాస్, రేంజర్ బ్రహ్మానంద సాహు, సెంచూరియన్ డీన్, దేవగిరి రేంజ్ ఫారెస్టర్ పి.వెంకటరమణ, ఫారెస్టుగార్డు ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటితేనే భవిష్యత్
జయపురం: మొక్కలు నాటి చెట్లు పెంచక పోతే దేశ పౌరులు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని తిరగాల్సి వస్తుందని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జయపురం అటవీ డివిజన్ విభాగం వారు జయపురం పూల్‌బెడ ప్రాంతంలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్ర సభా గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రేమికులు, రీసెర్చ్ స్కాలర్స్ సైంటిస్టులు పాల్గొన్నారు. సమావేశంలో జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహరా అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత పీకే మిశ్ర మాట్లాడుతూ దేశంలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వృధాగా ఉన్న భూములను పచ్చగా మార్చాలన్నారు. 2025 నుంచి 2050 లోగా జీరో కార్బన్ డై ఆకై ్సడ్ దేశంగా మార్చాలన్న కలను సాకారం చేసేందుకు ఉద్యమించాలన్నారు. అటవీ విభాగ అధికారి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ప్రపంచ అటవీ దినోత్సవంలో ప్రముఖ పర్యావరణవేత్త, స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఉదయ కుమార్ దాస్, డీఎఫ్‌ఓ ప్రతాప్ కుమార్ బెహరా, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం