విజయనగరం అర్బన్: అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రాంగణంలో బాలికలు సామూహిక ప్రదర్శన చేసి బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం పి.రమణమ్మ మాట్లాడుతూ యువత సునీత విలియమ్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల్లో స్ఫూర్తిని పెంచే విధంగా ఆమె చూపిన పట్టుదల, దృఢ సంకల్పం నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్రావు, ఈ.రామునాయుడు, పి.ఉమారాణి, ఎంవీ లక్ష్మీనరసమ్మ, సీహెచ్‌రత్నం, యూవీఏఎన్ రాజు, శ్రీరంగాచార్యులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
వేపాడ: మండలంలోని కుమ్మపల్లి సమీపంలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను వల్లంపూడి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశా రు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గ్రామసమీపంలోని తోటల్లో 500 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. దీంతో బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
బాలికల ఉన్నత పాఠశాలలో ‘సునీత’ విజయోత్సవాలు