
● విద్యతోనే వికాసం
రాయగడ: విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని, అందుకు విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని బిసంకటక్‌లో గల మా మార్కమా ఉన్నత మాధ్యమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారేందుకు విద్యార్థులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు ఎన్నో పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ వార్షికోత్సవంలో బీడీఓ సదాశివ నాయక్, ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్ పట్నాయక్, సర్పంచ్ నమిత కులసిక, తదితరులు హాజరయ్యారు. పాఠశాల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు ఉమా శంకర్ నెమల్‌పూరి వార్షిక నివేదికను చదివి వినిపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment