
వైభవంగా శోభాయాత్ర
శ్రీకాకుళం కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని భక్తి చైతన్య శోభాయాత్ర శనివారం ఘనంగా జరిగింది. ధర్మప్రచార పరిషత్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ లలితామణి ఆధ్వర్యంలో పీఎన్ కాలనీలోని నారాయణ తిరుమల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర గుజరాతిపేట, ఏడురోడ్ల కూడలి, కాకివీధి మీదుగా పాత శ్రీకాకుళంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వరకు సాగింది. 25 కోలాట బృందాలు, 2 తప్పెటగుళ్ల బృందాలు, 2 కూచిపూడి బృందాలు, 20 తాళ భజన బృందాలు పాల్గొన్నాయి. తొలుత ఈ యాత్రను పరత్మానంద స్వామి, గణేష్ స్వామి ప్రారంభించారు.కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నారాయణ తిరుమల అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment