
విప్పపువ్వు బస్తాలు స్వాధీనం
రాయగడ: స్థానిక సిరికొన సమీపంలో ఎకై ్సజ్ అధికారులు గురువారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో 2,800 కిలోల విప్పపువ్వు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చంద్ర గరడియా అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా గురువారం సిరికొన గ్రామ సమీపంలో అనుమానస్పదంగా కనిపించిన ఒక మినీ ట్రక్‌ను ఆపి తనిఖీ చేశారు. దీనిలో నాటుసారా తయారీకి వినియోగించే విప్పపూల బస్తాలు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎకై ్సజ్ ఐఐసీ సంజయ్ కుమార్ ప్రధాన్, ఎస్‌ఐ రాసి నాయక్, సంగ్రామ్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.