త్రుటిలో తప్పిన పెనుప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

Jun 21 2023 9:22 AM | Updated on Jun 21 2023 9:36 AM

నౌపడ వద్ద గూడ్స్‌రైలు  - Sakshi

నౌపడ వద్ద గూడ్స్‌రైలు

గేటు వేయలేదని గుర్తించి ఆగిన రైలు

టెక్కలి రూరల్‌: విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలుకు టెక్కలి మండలం నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే గేటు వద్ద పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం గూడ్స్‌ రైలు విశాఖపట్నం నుంచి నౌపడా మీదుగా భువనేశ్వర్‌ వైపు వెళ్తుండగా ఆ సమాచారం తెలియని గేట్‌మ్యాన్‌ గేటు వెయలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్‌ డ్రైవర్‌ రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. హారన్‌ వేయడంతో అప్రమత్తమైన గేట్‌ మ్యాన్‌ హుటాహూటిన గేటు వేశారు. దీంతో రైలు అక్కడి నుంచి వెళ్లింది. గూడ్స్‌ డ్రైవర్‌ గుర్తించకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement