పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు  | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు 

Jun 19 2023 12:52 AM | Updated on Jun 19 2023 11:07 AM

- - Sakshi

శ్రీకాకుళం: మండలంలోని బొడ్డవర వద్ద గూడ్స్‌ రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. కిరండూల్‌ నుంచి విశాఖకు ఐరన్‌ ఓర్‌తో వస్తున్న గూడ్స్‌ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో 20 కి.మీ వేగంతో రావాల్సిన రైలు 40 కి.మీ వేగంతో రావడం ప్రమాదానికి కారణం కావచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.

వరుస గా ఉన్న నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పగా మధ్యలో రెండు మినహా తరువాత మరో రెండు వ్యాగన్లు మొత్తంగా ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పా యి. ఐరన్‌ ఓర్‌ సమాంతరంగా వేయకపోవడం ప్రమాదానికి ఒక కారణం కావచ్చని భావిస్తున్నా రు. సోమవారం నాటికి ట్రాక్‌ పునరుద్ధరణ పను లు పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement