నందివాడ: మండలంలోని పోలుకొండలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో ఆదివారం రాత్రి చేరారు. మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో వారు పార్టీలో చేరారు. టీడీపీలో తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పటికీ అన్యాయం, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు, మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్ సీపీలో చేరామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తా మని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో వైఎస్సార్ సీపీ నాయకులు కందుల నాగరాజు, రవీంద్ర, తోట సతీష్, మానేపల్లి, కురమ నాగ శ్రీను, కురమ నాగులు, కురమ పున్నయ్య, కురమ రాంబాబు, సరిపల్లి ప్రణీత, ఏసుబాబు పాల్గొన్నారు.


