కచ్చితత్వంతో జనగణన | - | Sakshi
Sakshi News home page

కచ్చితత్వంతో జనగణన

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జనగణన–2027 రెండో దశ అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని సెన్సస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి. ప్రసన్న కుమార్‌ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ జనగణన కార్యకలాపాల ఏపీ డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లా, ఛార్జ్‌ స్థాయి అధికారులకు జనగణన 2027 రెండో దశపై నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణలో శనివారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ జనాభా లెక్కింపులో సేకరించే గణాంకాలు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభి వృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడతాయని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎ.రవీంద్రరావు, మాస్టర్‌ ట్రైనర్‌ కొల్లేటి రమేష్‌, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల సెన్సస్‌ ఇంచార్జి సీహెచ్‌ వెంకటరమణ, ఇన్‌స్ట్రక్టర్లు వి.ఆదిలక్ష్మి, ఎం.స్వాతి తదితరులు పాల్గొన్నారు.

రేపు గాజుల ప్రసాదం పంపిణీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు అలంకరించిన గాజులను ఈ నెల 16వ తేదీ భక్తులకు అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. గాజుల ఉత్సవం పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయం లోపల, వెలుపల, ఆలయ ప్రాంగణం, ఉపాలయాల్లో సుమారు 8 లక్షల గాజులతో విశేషంగా అలంకరించారు. ఉత్సవం ముగిసినా శనివారం, ఆదివారాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉండటం, వారికి కనీసం గాజులతో అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరించిన తీరును చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement