మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పైపుల రోడ్డులో ఉన్న ఎస్. కన్వెన్షన్ హాల్లో కృష్ణా జిల్లా పురుషులు, మహిళల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు గురువారం జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్ఆర్ డెవలపర్స్ అధినేత వలివర్తి సంజీవ రాజు ప్రారంభించారు. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ మాట్లాడుతూ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన కృష్ణా జిల్లా పురుషులు, మహిళల ఫెన్సింగ్ జట్లు ఈ నెల 15న కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. పీడీలు వీర బాబు, ఎన్.రాజు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.


