మల్లేశ్వరాలయంలో సహస్ర లింగార్చన | - | Sakshi
Sakshi News home page

మల్లేశ్వరాలయంలో సహస్ర లింగార్చన

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంలో బుధవారం స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు సహస్ర లింగార్చన నిర్వహించారు. పుట్టమన్నుతో లింగాలను సిద్ధం చేసి వాటికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విభూది, గంధంతో విశేషంగా అలంకరించారు. స్వామి వారిని ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సాయం సంధ్య వేళ మల్లేశ్వర స్వామి వారికి మహా నివేదన, పంచహారతుల సేవ నిర్వహించారు. ఆ ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. తొలుత అద్దాల మండపం నుంచి శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దీపాలంకరణ సేవలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలగించారు. సేవలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు హరికృష్ణ, సుబ్రహ్మణ్యకుమార్‌, సరిత, పద్మావతి ఠాగూర్‌లతో పాటు పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొని తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement