చోరీ కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

చోరీ కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి పాల్పడిన దొంగకు నూజివీడు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన వేల్పూరు వెంకటేశ్వరరావు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరు వెళ్లాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు ఇంటి తాళం పగలుకొట్టిన దుండగులు లోనికి చొరబడ్డారు. బీరువా తెరిచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంపాపురానికి చెందిన తాతనబోయిన సాయి తేజ ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతని వద్ద బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ కేసులో నూజివీడు న్యాయస్థానంలో ఏపీపీ వి.ప్రసన్న వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎం.శివ పార్వతి నింది తుడు తాతనబోయిన సాయితేజకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

మైలవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మైలవరం మండలం వెల్వడం వద్ద బుధవారం జరిగింది. మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన బింగి శంతను (25) కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండగకు ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి భార్య కీర్తన, మూడేళ్ల కుమార్తెతో చంద్రాలలో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై స్నేహితునితో కలిసి మైలవరం వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు శంతను స్నేహితుడు వాహనం నడుపుతున్నాడు. మినీ వ్యానును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను చూసి సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక కూర్చున్న శంతను కిందపడగా, అతని పై నుంచి టిప్పర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శంతను స్నేహితుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శంతను మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement