విజయవాడ వేదికగా జాతీయ సంగీతోత్సవాలు 16 నుంచి 22 వరకు శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహణ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్వాంసుల రాక
విజయవాడ కల్చరల్: సంగీతానికి సరిహద్దులు లేవు. స్వరమే భాషగా, రాగమే భావంగా, లయే ప్రాణంగా సాగిపోయే శాసీ్త్రయ సంగీత ప్రపంచంలో విజయవాడకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏటా చైన్నెలో మార్గశిర సంగీతోత్సవం (డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్) పేరుతో సంగీత ఉత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సంగీత విద్వాంసులందరూ అక్కడకు చేరుకుంటారు. నెలల ముందే టిక్‌ట్స్ బుక్ ఐపోతాయి. చెన్త్నె తరువాత జాతీయ స్థాయిలో సంగీత ఉత్సవాలను నిర్వహించే ఏకై క సంస్థ నగరానికి చెందిన శ్రీ సద్గురు సంగీత సభ. సంగీత విద్వాంసుల కచేరీలను నగరంలో వారం రోజులపాటు ఏటా ఏర్పాటు చేస్తుంది. ఆ క్రమంలో ఈ ఏడాది దుర్గాపురంలోని సంగీత కళాశాలలో ఈనెల 16వ తేదీ నుంచి 22 వరకు జాతీయ సంగీతోత్సవాలను నిర్వహిస్తోంది.
ప్రముఖ విద్వాంసుల రాక..
వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్వాంసులు సంగీతోత్సవాల్లో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వారిలో ఎస్‌కే మహతి, వివేక్ సదాశివం, జేజేఆర్ కృష్ణన్, సర్వేపల్లి సోదరీమణులు డాక్టర్ సర్వేపల్లి శ్రేయ, సర్వేపల్లి రాజ్యలక్ష్మి, పోపూరి గౌరీ నాథ్, కల్యాణపురం ఎస్. అరవింద్, అలవేణుగోపాల్ నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సంగీత విద్వన్‌మణి..
ఈ కార్యక్రమంలో భాగంగానే సంగీత రంగంలో విశేషమైన సేవలు చేసిన వారిని గుర్తించి ఏటా సంగీత విద్వన్ మణి పురస్కారాలను అందజేస్తున్నారు. గతంలో వయోలిన్ విద్వాంసులు అవసరాల కన్యాకుమారి, మృదంగ విద్వాంసురాలు దండమూడి సుమతీ రామ్మోనరావులాంటి వారికెందరికో అందజేశారు. 2026 సంవత్సరానికి గానూ డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మకు సంగీతోత్సవంలో భాగంగా ప్రదానం చేస్తున్నారు.
యువ ప్రతిభకు చేయాత..
కేవలం ప్రముఖ విద్వాంసుల కచేరీలో కాకుండా రేపటి సంగీత ప్రపంచానికి వారసులుగా ఎదగాల్సిన యువ కళాకారులను ప్రోత్సహించడంలోనూ శ్రీ సద్గురు సంగీత సభ ప్రత్యేకత చూపుతోంది. యువ ప్రతిభను గుర్తించి వారికి ప్రదర్శన అవకాశాలు కల్పించడంతోపాటు వారికి ఆర్థికంగా సాయం చేస్తోంది.


