మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు మంగళవారం ఎంపికలు జరుగుతాయని ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ ఎండీ ఎస్.భరణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగునున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో కబడ్డీ పురుషులు, కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో ఖో ఖో పురుషులు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్ ఆవరణలోని మైదానంలో బాలబాలికలకు మల్లంబ్ పోటీలను నిర్వహించి రాష్ట్రస్థాయి జట్టులో క్రీడాకారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈ జట్ల ఎంపిక బాధ్యతలను కృష్ణాజిల్లా ప్రాథికార సంస్థకు చెందిన కబడ్డీ కోచ్ కె.జగదీష్‌ను డిప్యూటేషన్‌పై నియమించామని తెలిపారు.
ఫొటో స్టూడియోలో
అగ్నిప్రమాదం
రూ.20 లక్షల ఆస్తి నష్టం
తిరువూరు: స్థానిక బోస్ సెంటర్ సమీపంలోని ఒక ఫొటో స్టూడియోలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగి రూ.20 లక్షల ఆస్తి నష్టం కలిగింది. స్టూడియో యజమాని నరేష్ తెలిపిన వివరాల మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి కంప్యూటర్లు, ఫొటోగ్రఫీ పరికరాలు, ఫొటోఫ్రేమ్ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. హార్డుడిస్కుల్లో భద్రపరచిన విలువైన ఫొటోలు, డేటా కూడా మంటల్లో కాలిపోయింది.అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.


