కక్షతో దారుణ హత్య! | - | Sakshi
Sakshi News home page

కక్షతో దారుణ హత్య!

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

కంకిపాడులో పీఎస్‌ పరిధిలో ఘటన మృతుడు బిహార్‌ వాసి డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న మృతుడు

కంకిపాడు: కంకిపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధ రాత్రి దాటిన తర్వాత దారుణ హత్య చోటు చేసుకుంది. పునాదిపాడు గ్రామ పరిధిలోని ఓ డెయిరీ ఫాంలో ఒంటరిగా నిద్రిస్తున్న బిహార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడిని పాత కక్షల నేపథ్యంలో కత్తులతో పొడిచి హతమార్చారు. గతంలో అతనితో కలిసి పని చేసిన కార్మికుడు మరికొందరితో కలిసి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమో దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పువ్వాడ శ్రీనివాసరావు నాలుగు నెలల క్రితం కంకిపాడు బైపాస్‌ వెంబడి పునాదిపాడు గ్రామ పరిధిలో శ్రీరాజ్యలక్ష్మి డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో బిహార్‌ రాష్ట్రానికి చెందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (26), రాకేష్‌ పనిచేస్తున్నారు. అయితే ఫామ్‌ యజమాని రాకేష్‌ను పనిలో నుంచి తొలగించాడు. ఈ విషయమై రాకేష్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌కు మధ్య వివాదం నెలకొంది.

కత్తులతో పొడిచి..

ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి తరువాత ఫామ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ను రాకేష్‌, మరికొందరు కలిసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో కొట్టుకులాడుతున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ను చూసి పరారయ్యారు. గాయాలతో ఉన్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ సమీపంలోని ఓ పాకలో పనిచేస్తున్న బిహార్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తుల వద్దకు గాయాలతోనే వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. దీంతో వారు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

హత్యకు కారణాలపై..

విషయం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు ఘట నా స్థలానికి చేరుకున్నారు. గన్నవరం డీఎస్పీ జయకృష్ణ, సీఐ రవికుమార్‌, క్లూస్‌టీం ఎస్‌ఐ త్రివర్ణ, సిబ్బందితో ఘటనాస్థలంలో వివరాలు సేకరించా రు. కత్తులతో దాడి చేసిన అనంతరం పరారయ్యేందుకు నిందితులకు సహకరించిన వ్యక్తులు ఎవరు?, ఎంత మందికి పాత్ర ఉంది? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ హత్యకు గల కారణాలపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement