డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘటన
పెదకాకాని/కాచవరం: కలిసి పని చేశారు.. స్నేహంగా మెలిగారు.. బంధువుల ఇంటికి కలిసి బయలుదేరారు. కానీ విధి వక్రించి వారి ప్రయాణం విషాదాంతమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యు వకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి రెండు కుటుంబాలకు తీరాని శోకాన్ని మిగిల్చారు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండకు చెందిన వేముల సర్వేంద్ర(22), దావులి వెంకటేష్(23) ఇద్ద రూ స్నేహితులు. సమీపంలోని స్టీల్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వారిద్దరూ గుంటూరు జిల్లా పేరేచర్లలోని బంధువుల ఇంటికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో పెదకాకాని గ్రా మ శివారులోని పల్లాలమ్మ చెరువు వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఘటనా స్థలిలో మృతి
ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బంధువులు కన్నీరుమున్నీరు
వెంకటేష్ తండ్రి ఏడాది క్రితమే మరణించగా, తల్లి, అన్న, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. సరేంద్రకు తల్లిదండ్రులతోపాటు ఓ సోదరుడు ఉన్నారు. ఇద్దరు యువకుల మరణవార్తతో కుటుంబ సభ్యులు బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సరేంద్ర తండ్రి రాజగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టి.పి.నారాయణస్వామి తెలిపారు.


