1,108 ఓట్ల మెజార్టీ.. జెడ్పీటీసీకి సత్కారం | - | Sakshi
Sakshi News home page

1,108 ఓట్ల మెజార్టీ.. జెడ్పీటీసీకి సత్కారం

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

జగ్గయ్యపేట అర్బన్‌: మండలంలోని వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా 1108 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన మండవ శ్రీనివాసగౌడ్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నేతలు అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌.. శ్రీనివాసగౌడ్‌ను శాలువా కప్పి సత్కరించినట్లు గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజి, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠరావు, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నర్మనేని వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

–మండవ శ్రీనివాసగౌడ్‌ను మాజీ మంత్రులు జోగి రమేష్‌, వెలంపల్లి శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసగౌడ్‌ వారివారి నివాసాల్లో తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో మర్యాదపూర్వకంగా కలవగా సత్కరిచారు. గుంటూరులో పార్టీ విజయవాడ పార్లమెంట్‌ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని వారి నివాసంలో, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ను నందిగామలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా శ్రీనివాసగౌడ్‌ను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement