దీపాల పండుగకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

దీపాల పండుగకు సిద్ధం

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

దీపాల పండుగకు సిద్ధం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దీపావళి పండుగకు మట్టి ప్రమిదలు సిద్ధమయ్యాయి. వెలుగుల పండుగ అయినా దీపావళిని జరుపుకోవడానికి ముఖ్యమైన ప్రమిదలు విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల పక్కన, షాపింగ్‌ మాల్స్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మట్టి ప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉన్నాయి.

రూ.5 నుంచి రూ.1500 వరకు..

మట్టితో చేసిన ఈ ప్రమిదలు ఒక్కొకటి వాటి సైజును బట్టి రూ.5 నుంచి రూ.1500 వరకు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆకృతులు, రంగుల్లో లభిస్తున్నాయి. చిన్న ప్రమిదలు ఒక్కొక్కటి రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. వివిధ ఆకృతుల్లో అందంగా ఉన్న డజను ప్రమిదలు సైజును బట్టి రూ.100 నుంచి రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా ఏనుగు, తాబేలు, పూర్ణకుంభం, తామర పువ్వు మొదలైన ఆకారాల్లో తయారు చేసిన మట్టి ప్రమిదలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డు, గాయత్రినగర్‌, సిద్ధార్థ జంక్షన్‌, సున్నపుబట్టీల సెంటర్‌, విశాలాంధ్ర రోడ్డు, మధుచౌక్‌, నిమ్మతోట సెంటర్‌ల్లో ఈ మట్టి ప్రమిదల విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మెటల్‌, ఇత్తడి, ఎలక్ట్రికల్‌ ప్రమిదలు సైతం వివిధ ఆకృతుల్లో ఆటకట్టుకుంటున్నాయి.

షాపింగ్‌ మాల్స్‌లోనూ సిద్ధం

నగరంలోని రహదారుల వెంట మార్జిన్ల లోనే కాకుండా వాణిజ్య సముదాల్లో సైతం (షాపింగ్‌ మాల్స్‌)లో దీపావళి సందర్భంగా దీపాలు, కొవ్వొత్తులకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి అందంగా అకరించి విక్రయాలు సాగిస్తున్నారు. ఆకట్టుకునే రంగులు, ఆకృతుల్లో అందంగా ముస్తాబు చేసి విక్రయిస్తున్నారు. ఇంటిని మరింత అందంగా ముస్తాబుచేసేందుకు ఎల్‌ఈడీ లైట్లతో తయారు చేసిన ఎలక్ట్రికల్‌ ప్రమిదలు, లైటింగ్‌, తోరణాలు ఇలా అన్నింటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

దీపావళికి వివిధ ఆకృతుల్లో ప్రమిదల తయారీ

ఆకర్షణీయంగా మెటల్‌, ఎలక్ట్రిక్‌ ప్రమిదలు

రోడ్లపైనే కాకుండా షాపింగ్‌ మాల్స్‌లోనూ విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement