నీట మునిగిన పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

నీట మునిగిన పోలింగ్‌ కేంద్రాలు

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

నందివాడ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో నందివాడ మండలం రుద్రపాక, జనార్దనపురం గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలు నీటమునగడంతో ఓటర్లు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల ఆవరణలు మొత్తం వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. నీటిలోనే నడిచి వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు జరుగుతాయని తెలిసినా నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ఆయా గ్రామాల ఓటర్లు ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదని, ఈసారి మాత్రం పోలింగ్‌ కేంద్రం ఆవరణలో భారీగా నీరు నిలిచిపోవడంతో ఓటు వేయడానికి రావడమే కష్టంగా మారిందని పలువురు ఓటర్లు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement