ఎన్నికలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సర్వం సిద్ధం

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

ఎన్నికలకు సర్వం సిద్ధం

జి.కొండూరులో కలెక్టర్‌ లక్ష్మీశ

జి.కొండూరు: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. జి. కొండూరు కమ్యూనిటీ హాలులో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 16మండలాల పరిధిలో 280 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 5వేల మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. తుపాను ప్రభావం వల్ల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అసౌక్యరం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భద్రతా పరంగా ఎటువంటి సమస్యా తలెత్తకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ, వీడియోగ్రాఫర్ల కేటాయింపుతో పాటు భారీగా పోలీసులతో రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఓ నాగమల్లిక, తహసీల్దార్‌ రిబ్కారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement