విద్యుత్‌ షాక్‌తో బాలుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో బాలుడి దుర్మరణం

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని పెనుమాక గ్రామంలో నివసించే ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌తో బుధవారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెనుమాక గ్రామానికి చెందిన కాజా కుమారుడు అమీర్‌(9) స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటిపైన డాబాపై దీపావళి టపాసులతో ఆడుకుంటున్నాడు. పక్క బిల్డింగ్‌పై మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటుండగా అమీర్‌ చేతిలో ఉన్న అగ్గిపుల్లలను వెలిగించి వారిపైకి సరదాగా విసిరివేస్తున్నాడు. ఆ క్రమంలో డాబాకు పిట్టగోడ మధ్యలో ఉన్న ఐరన్‌ గ్రిల్‌ పట్టుకుని పైకి ఎక్కి అగ్గిపుల్ల వేసే క్రమంలో బిల్డింగ్‌కు ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాల వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై అమీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ తల్లి, బంధువులు హుటాహుటిన వైద్యం నిమిత్తం మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకెఎళ్లారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement