గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లీడర్ పత్రికపై కూటమి ప్రభుత్వం, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నంలో 55 ఎకరాల భూములు, పోలీస్ కమిషనర్‌కు సంబంధించిన బిట్‌కాయిన్ వ్యవహారాలపై లీడర్ పత్రికలో కథనాలు ప్రచురించినందుకే ఆ పత్రిక ఎడిటర్ వి.వి.రమణమూర్తిపై నాలుగు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తెలుసుకొని ఆయన మీద ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహదేవ్, హరి కృష్ణ పాల్గొన్నారు.
విజయవాడలీగల్: సోనాలి రకం కోడిపిల్లలను, వాటికి దాణా సప్లయి చేసి, మరలా వాటిని తానే కొనుగోలుచేసి డబ్బులు ఇస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకొని పసుపులేటి అంకుశం తమను మోసం చేసినట్లు బాధితులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ కేసులో పసుపులేటి అంకుశం ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు వారంరోజులపాటు పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు రెండో అదనపు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. డిఫెన్స్ న్యాయవాదులకు నోటీసు నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేశారు.


