కృత్తివెన్ను: తీరప్రాంతమైన కృత్తివెన్ను మండలంలో రెండురోజులుగా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మండలంలోని ఏటిమెండిపల్లెపాలెంలో ఏర్పాటు చేసిన 46వ పోలింగ్ కేంద్రం, మాట్లాంలో ఏర్పాటు చేసిన 22, 23, 24 పోలింగ్ కేంద్రాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. బుధవారం రాత్రి వర్షం కురవకపోతే అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ వర్షం కురిస్తే అక్కడ ఓటర్లకు తిప్పలు తప్పవు. ఇక్కడ సమీపంలో ఏటియలు ఉండటంతో పోటునీరు అధికంగా వచ్చేస్తుంది. దీంతో పోలింగ్ కేంద్రాలు నీటమునిగాయి.
ఏటిమొండిపల్లెపాలెం పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి
మాట్లాం గ్రామంలో
పోలింగ్ జరిగే హైస్కూల్ వద్ద పరిస్థితి


