ఉప్పొంగిన వాగులు | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన వాగులు

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మైలవరం మండలంలో కొండవాగుకు బుధవారం ఉదయం భారీగా వరద రావడంతో బాలయోగి నగర్‌, సూరిబాబు పేట, శుద్ధిపేట మధ్య రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. జి.కొండూరు మండలంలో పులివాగులో బుధవారం మధ్యాహ్నం వరకు భారీ వరదతో ప్రవహించింది. హెచ్‌.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మధ్య బుడమేరు వంతెనపై వరద ప్రవహించడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. కుంటముక్కల, వెల్లటూరు గ్రామాల మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను ప్రభావం బుధవారం ఉదయం నుంచి లేకపోవడంతో వాగుల్లో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పట్టింది.

– జి.కొండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement