రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపిన కథనం మేరకు...కోనసీమ జిల్లా పి.గన్నవరంనకు చెందిన సీహెచ్‌.రవికుమార్‌ (38) కొంతకాలంగా విజయవాడ కండ్రికలో నివసిస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జోరు వర్షంలో కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తుండగా కంకిపాడు బైపాస్‌పై జరిగిన ప్రమాదంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపారు. ప్రమాదవశాత్తూ వాహనం అదుపుతప్పి కింద పడి మృతి చెందాడా? లేక ఏదైనా వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement