ప్రతి బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

ప్రతి బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి తాడిగడప వార్డుల రిజర్వేషన్లు ఖరారు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల పెనమలూరు: తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి వార్డు రిజర్వేషన్‌లు ఖరారు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ శనివారం విడుదల చేశారు. తాడిగడప చైర్మన్‌ పదవి ఇప్పటికే బీసీ జనరల్‌గా రిజర్వు చేశారు. ఇక వార్డుల విషయానికి వస్తే ఎస్‌టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ మహిళకు 2, ఎస్సీ జనరల్‌కు 3 వార్డులు కేటాయించారు. బీసీ మహిళకు 9, బీసీ జనరల్‌కు 9, మహిళకు 13, జనరల్‌కు 11 వార్డుల చొప్పున కేటాయించారు. ఎస్‌టీ జనరల్‌కు 22వ వార్డు, ఎస్సీ మహిళకు 13, 32 వార్డులు, ఎస్సీ జనరల్‌కు 3, 4, 45 వార్డులు, బీసీ మహిళకు 16, 17, 18, 19, 26, 27, 28, 29, 46, బీసీ జనరల్‌కు 20, 21, 31, 35, 36, 37, 38, 39, 48 వార్డులు కుటాయించారు. మహిళలకు 1, 5, 6, 7, 9, 10, 12, 15, 23, 30, 42, 43, 47, జనరల్‌కు 2, 8, 11, 14, 24, 25, 33, 34, 40, 41, 44 వార్డులు ఖరారు చేశారు. ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేస్తా

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌

జిల్లా అధ్యక్షుడు సాయిరామ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సుప్రీం కోర్టు తీర్పు ఉత్తర్వుల మేరకు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాయిరామ్‌, తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్‌ను కలిసి సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు దోహదం చేస్తాయన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

వార్డుల రిజర్వేషన్‌లు ఇవే..

ఉయ్యూరు(కంకిపాడు): ఉయ్యూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానని జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొనుగుమాటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బాలస్వామి) అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. బాలస్వామి మాట్లాడుతూ మండలంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రజల మేలు కోసమే పనిచేస్తుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement