ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలు

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు సేవలు అందించనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధి నిర్వహణలో క్యూ లైన్స్‌ మేనేజ్‌మెంట్‌లో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లుగా భాగస్వాములను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా శనివారం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు విధులు ఏవిధంగా నిర్వహించాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు 1100 మంది సేవలు అందించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వెన్నెల శ్రీను, డీసీపీలు సరిత, సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్‌, సీఐ ఎంవీ దుర్గారావు,ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement