అయోడిన్‌ లోపంతో రుగ్మతలు | - | Sakshi
Sakshi News home page

అయోడిన్‌ లోపంతో రుగ్మతలు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

నున్న(విజయవాడరూరల్‌):అయోడిన్‌ శరీర ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి, మానసిక సామర్థ్యానికి, నేర్చుకునే నైపుణ్యాలకు ఎంతో అవసరమని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు అన్నారు. జాతీయ అయోడిన్‌ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని ఓ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు విద్యార్థులకు అయోడిన్‌ ప్రాముఖ్యతను వివరించి, అయోడిన్‌ కలిగిన ఉప్పు వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్‌కే వైద్యాధికారి డాక్టర్‌ మాధవీనాయుడు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement