గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్‌లోని అర్నాబ్ తుపాను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షించి సమన్వయ శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 29, తిరువూరు డివిజన్‌లో 77, నందిగామ డివిజన్‌లో 44, విజయవాడ డివిజన్‌లో 16 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తీవ్రతను బట్టి అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.


