వైఎస్సార్‌ సీపీతో సంక్షేమ పాలన | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీతో సంక్షేమ పాలన

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గత ఐదేళ్లలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చి పథకాలను డోర్‌ డెలివరీ చేశామని.. అటువంటి పాలన రావాలంటే వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని కోరుతూ విజయవాడ, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, కొండపల్లిలో పోటీ చేస్తున్న మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో..

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనూ, ఆమె మేయర్‌గా చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. లాండ్రీ షాపు వద్దకు వెళ్లి ఇసీ్త్ర చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. నగరంలోని 64, 65 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ‘గత ఐదేళ్లూ మీతో కలిసి ప్రయాణం చేశాను. ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాగించాను. విజయవాడ నగరానికి మూడు ర్యాంకులు సాఽధించాం. రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు పొందాం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం’ అని రాయన భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు.

జగ్గయ్యపేటలో..

జగ్గయ్యపేట మున్సిపాలిటీలోని 23వ వార్డులో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి హఫీజున్నీసా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్‌ కావేటి లక్ష్మి, తన్నీరు సుధారాణితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్‌ సీపీయే అన్నారు.

తిరువూరులో..

తిరువూరు పట్టణంలోని 9వ వార్డులో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ నలగట్ల సుధారాణి ప్రచారంలో పాల్గొని పట్టణం అభివృద్ధి చెందాలంటే పరసా శ్రీనివాసరావును, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 9వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి దేవిరెడ్డి ఆదిలక్ష్మి, నేతలు పాల్గొన్నారు.

నందిగామలో..

వైఎస్సార్‌ సీపీ నందిగామ మున్సిపాలిటి చైర్మన్‌ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం) ప్రచారం హోరెత్తించారు. 6వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, కౌన్సిలర్‌ అభ్యర్థి కోలేటి నాగరాణితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని సీఎం రోడ్డును ఎవరు ఊహించలేనంత.. అభివృద్ధి చేశామని, అందరికీ మంచి చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ మహమ్మద్‌ మస్తాన్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దుకూరి సాయిబాబు, సీనియర్‌ నాయకులు పాములపాటి రమేష్‌, కోలేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లిలో....

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 12, 13, 14, 15 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి నల్లమోతు తేజస్వి మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయ కుండా ప్రజలను ఏ విధంగా మోసగించిందో ఓటర్లకు వివరించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement