వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని 90 వేల మందికి ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా నగర శివారులోని మద్దూరు, వణుకూరు, పాములకాలువ, జి.కొండూరు తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేసి అందించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల తర్వాత ఒక్క నూతన గృహాన్నీ మంజూరు చేయలేదు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నగరంలో కొత్తగా భవానీపురం, కృష్ణలంక, అజిత్‌సింగ్‌నగర్, లెనిన్‌సెంటర్‌లో 15 పార్కుల నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్కులకు కూడా నిధులు కేటాయించలేదు. పార్కులకు అవసరమైన పరికరాలను సక్రమంగా సమకూర్చలేదు.


