దుర్గాభవానీ | - | Sakshi
Sakshi News home page

దుర్గాభవానీ

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 uII లో దుర్గాభవానీ పెద్ద ఎత్తున తరలివస్తున్న భవానీలు రమణీయం.. నగరోత్సవం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం 3.45 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయంతో పాటు హోల్‌సేల్‌ పూలమార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు మొత్తం భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. వీఎంసీ కార్యాలయం వైపు నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించే భక్తులకు అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. భవానీపురం, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వైపు ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకున్న వారికి రెండున్నర గంటల్లో అమ్మవారి దర్శనం పూర్తవుతోంది. దసరా ఉత్సవాలలో 8 రోజులకు మొత్తం 17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం భక్తుల రద్దీ అఽధికంగా ఉండటంతో సుమారు రెండు లక్షల లడ్డూలను విక్రయించామన్నారు. ఉత్సవాలలో కీలకమైన 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు భవానీల రద్దీ అధికంగా ఉండటంతో పాటు లడ్డూ విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇందు కోసం మరో 30 లక్షల లడ్డూల తయారికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం విక్రయం కోసం మొత్తం 19 కౌంటర్లు అందుబాటులో ఉంచారు. దసరా మహోత్సవాలలో భాగంగా 8వ రోజు ఆదివారం దేవస్థానానికి రూ.35.15లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాలు విక్రయం ద్వారానే రూ. 33.50 లక్షల మేర ఆదాయం సమకూరిందని, కేశకండన శాల ద్వారా రూ. 1.44లక్షలు, పుస్తకాలు, అమ్మవారి ఫొటోల ద్వారా రూ. 10వేల ఆదాయం లభించిందన్నారు. కాగా మహోత్సవాలలో భాగంగా 9వ రోజు సోమవారం దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధినీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో దర్శించడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. హంసవాహనం ట్రయల్‌ రన్‌

బెజవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి నామినేషన్‌

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

పులిచింతల సమాచారం

కోలాహలంగా..

దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణా నదిలో హంసవాహనంపై ఆదిదంపతులు విహరిస్తారు. ఇందు కోసం ఏటా ఉత్సవాలలో హంసవాహనాన్ని సిద్ధం చేస్తుంటారు. ఈ ఏడాది ఉత్సవాల కోసం హంస వాహనం సిద్ధం కాగా, ఆదివారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు, ఇరిగేషన్‌, అగ్నిమాపకశాఖ అధికారులు ఈ ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నారు. దుర్గాఘాట్‌ నుంచి ప్రారంభమైన హంసవాహనం నది మధ్యలో ఉన్న భవానీదీపం సమీపం వరకు వెళ్లి ఘాట్‌కు చేరుకుంది. హంస వాహన సేవకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలతో పాటు ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో చర్చించారు.

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
uII లో
జయహో
పెద్ద ఎత్తున తరలివస్తున్న భవానీలు
రమణీయం.. నగరోత్సవం

● కూటమిలో సీట్ల కోసం

కొనసాగిన కుస్తీ

● రెండు పార్టీలకు

ఒకే అభ్యర్థి నామినేషన్లు

● రాధా నామినేషన్‌కు

హాజరుకాని బొండా, గద్దె, చిన్ని

● ‘పుర’ పోరులో తొలి ఘట్టం సమాప్తం

I

తెగని పంచాయితీ!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ఇప్పటివరకూ సీట్ల పంచాయితీ తేలకపోవడంతో కూటమి తరఫున బరిలో పెద్ద ఎత్తున పోటీలో నిలిచారు. విజయవాడ కార్పొరేషన్‌లో దాదాపు అన్ని డివిజన్లలో మూడు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మేయర్‌ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో కూడా వారి మద్య విభేదాలు కనపడ్డాయి. విజయవాడ జనసేనకు మేయర్‌ పదవిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ నామినేషన్‌కు హాజరుకాలేదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కూడా దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న గద్దె అనురాధ, వెస్ట్‌ ఇన్‌చార్జ్‌ బుద్ధా వెంకన్న మాత్రమే హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఇతర ప్రముఖులు ఎవ్వరూ నామినేషన్‌ కార్యక్రమం వైపు తొంగి చూడలేదు. నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చిన గద్దె అనురాధ, బుద్ధా వెంకన్నలను లోపలికి పిలవకపోవడంతో అవమానంగా భావించి దూరంగా ఉండిపోయారు.

డివిజన్లలోనూ ఎవరికి వారే..

ఇక డివిజన్ల విషయానికి వస్తే అసలు ఎవరు ఏ డివిజన్‌లో వేశారో తెలియకుండా నామినేషన్లు వేసేశారు. ఒకే డివిజన్‌లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నుంచి నామినేషన్లు వేశారు. విజయవాడ పశ్చిమలో 28 డివిజన్లు ఉంటే అందులో బీజేపీ 17 డివిజన్లలో, తెలుగుదేశం 29 డివిజన్లలో, జనసేన 19 డివిజన్లలో నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ 29 డివిజన్లకు గాను 28 డివిజన్లలో పోటీకి దిగగా, జనసేన 14 డివిజన్లు, బీజేపీ నాలుగు డివిజన్లకు నామినేషన్లు వేశారు. ఇక్కడ జనసేనకు ఏడు, బీజేపీకి రెండు సీట్లు ఇవ్వడానికి అంగీకారం కుదిరినా దానికి రెట్టింపు సీట్లలో వారు నామినేషన్లు వేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ అన్ని డివిజన్లకు పోటీలో దిగగా జనసేన 21 డివిజన్లలో బీజేపీ తొమ్మిది స్థానాల్లో నామినేషన్లు వేసింది.

● తిరువూరు మునిసిపాలిటీలో కూటమి పార్టీల తరఫున రెబల్స్‌ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తిరువూరు మునిసిపల్‌ చెర్మన్‌ పదవిని కూటమి పార్టీలు జనసేనకు కేటాయించగా పసుపులేటి మాధవికి ఆ పార్టీ ‘బీ’ ఫారం ఇచ్చింది. ఆదివారం మాధవి టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో నామినేషన్‌ దాఖలు చేయగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెనుమల్లి శ్రావణికి మద్దతు తెలిపి రెబల్‌గా నామినేషన్‌ వేయించారు. వార్డుల్లో సైతం టీడీపీలోని ఎంపీ, ఎమ్మెల్యే వర్గీ యులు, జనసేన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత జనసేన టికెట్‌ శ్రావణికి ఇచ్చి తర్వాత మాధవి పేరు ప్రకటించడాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.

● జగ్గయ్యపేట మునిసిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి రెబల్స్‌ బెడద పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరేంద్రుల వినీత పోటీ చేస్తుండగా, ఆమెకు రెబల్‌ అభ్యర్థిగా ఆచంట సునీత తెలుగుదేశం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కొండపల్లిలో టీడీపీ అభ్యర్థిగా కన్నెకంటి అమూల్య చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ప్రస్తుత 22వ వార్డు కౌన్సిలర్‌ వీజే దేవకుమారి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. బీజేపీకి చెందిన తురక సుస్మ కూటమికి వ్యతిరేకంగా రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మినహాయించి అందరూ కూటమికి సానుభూతిపరులుగా ఉన్నవారే.

పెరిగిన భవానీల తాకిడి..

జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. భవానీ దీక్షపరులు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడు లను సమర్పిస్తున్నారు. మహా మండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద గురు భవానీలకు ఇరుముడులను సమర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం వైపు నుంచి పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భవానీలను దేవస్థానం బస్సుల్లో కొండపైకి చేర్చుతున్నారు. ఓం టర్నింగ్‌ నుంచి ఆలయానికి చేరుకుంటున్న భవానీలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్న భవానీలకు సేవా సిబ్బంది వేడివేడి పాలు, బిస్కెట్లు అందజేస్తున్నారు.

17 లక్షల లడ్డూల విక్రయం..

8వ రోజు ఆదాయం

రూ. 35.15లక్షలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ మేయర్‌ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆదివారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసి, పార్టీ ముఖ్యనేతలు వెంటరాగా నగరపాలకసంస్థలో ఏర్పాటు చేసిన ఎలక్షన్‌ సెల్‌లో ఆమె తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

అనుమతి నిరాకరణ..

వాస్తవానికి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేయాలని భావించినా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు కూటమి అభ్యర్థి నామినేషన్‌కు మాత్రం భారీ ర్యాలీకి అనుమతించడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ ప్రాంతీయ పరిశీలకులు అయోధ్య రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవి నాష్‌, మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస రావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్‌ పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) రద్దు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.5553 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.

కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్‌ వద్ద బతుకమ్మ సంబరం ఆదివారం కోలాహలంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ ఆదివారం కనుల పండువగా జరిగింది. తొలుత మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అధికారులు కొబ్బరికాయలను కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఆలయానికి చేరుకున్న అనంతరం రాజగోపురం ఎదుట ఆస్థాన సేవను నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు విశేష చతుర్వేద హారతులను సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement