నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యం

అధికారుల తీరుపై దేవినేని అవినాష్‌ ఆగ్రహం

లబ్బీపేట(విజయవాడతూర్పు): మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీ–ఫారాల సమర్పణ, నామినేషన్ల పరిశీలన విషయంలో ఎన్నికల మాన్యువల్‌లోని నిబంధనలను పాటించాలన్నారు. పత్రాలు సక్రమంగా ఉన్నా స్క్రూటినీ పేరుతో నామినేషన్లను తిరస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అంశంపై నగరపాలక సంస్థ కమిషనర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎన్‌ఐఆర్‌డీ అడిషనల్‌ డైరెక్టర్‌ సుధీర్‌ కుమార్‌

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్‌కు వేదిక ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే సరస్‌ మేళా లక్ష్యమని ఎన్‌ఐఆర్‌డీ అడిషనల్‌ డైరెక్టర్‌ సుధీర్‌ కుమార్‌ అన్నారు. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (సెర్ప్‌) ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్‌ మేళాను ఆయన శనివారం సందర్శంచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను నాణ్యమైన బ్రాండ్‌లుగా అభివృద్ధి చేసుకుని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేలా ప్రోత్సహించేందుకు మీట్‌ అండ్‌ గ్రీట్‌ పెవిలియన్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిపుణులు, జాతీయ స్థాయి నిపుణుల సహకారంతో ప్రతిరోజూ నిర్వహిస్తున్న శిక్షణలో బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, ఎగుమతి మార్కెటింగ్‌ వాల్యూ చైన్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. సెర్ప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ సరస్‌ మేళాకు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు తెలిపారు. సమావేశంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఖటారియా, ఎన్టీఆర్‌ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఏఎన్‌వీ నాంచారరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement