మేయర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల పరిశీలకురాలిగా నాగలక్ష్మి

పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు నాగలక్ష్మి శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేయర్‌ ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆమె సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారం, ఫారాలు ఏ విధంగా అందజేస్తున్నారు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన రికార్డులు, కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం పొందారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 86 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితులపై చర్చించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, అదనపు కమిషనర్‌, ఎన్నికల నోడల్‌ అధికారి ఎ.రవీంద్రరావు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌ ఎన్నిక, జగ్గయ్యపేట, తిరువూరు, కొండపల్లి, నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల పరిశీలకురాలిగా ఏపీ జెన్‌కో ఎండీ ఎస్‌.నాగలక్ష్మిని ఎన్నికల కమిషన్‌ నియమించింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ సమస్యలను ఏవైనా చెప్పుకోదలచుకుంటే 7680980032 నంబరులో సంప్రదించవచ్చని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement