సీనియర్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

సీనియర్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్‌ – 2026లో భాగంగా పురుషులు, మహిళల సీనియర్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రటరీ ఏవీ రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.అర్జునరావు, అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ కేవీ నాంచారయ్య, రెఫరీస్‌ బోర్డు చైర్మన్‌ మురళీ కుమార్‌తో పాటుగా అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో జరిగిన పోటీల్లో నెల్లూరు జట్టు కర్నూలుపై 45–24 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కృష్ణా జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 50–39 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్‌ మ్యాచ్‌లు ఆదివారం కూడా కొనసాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement