చెస్‌ పోటీల్లో సిద్ధార్థ, గుడ్లవల్లేరు కళాశాలల గెలుపు | - | Sakshi
Sakshi News home page

చెస్‌ పోటీల్లో సిద్ధార్థ, గుడ్లవల్లేరు కళాశాలల గెలుపు

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ెపనమలూరు: కానూరు పీవీపీ సిద్ధార్థలో జరిగిన జేఎన్‌టీయూ అంతర్‌ కళాశాలల చెస్‌ పోటీలలో పురుషుల విభాగంలో కానూరు వీఆర్‌ సిద్ధార్థ, మహిళల విభాగంలో గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌ కాలేజీలు విజయం సాధించాయి. కానూరులో ఈ నెల 16,17 తేదీలలో జేఎన్‌టీయూ అంతర్‌ కళాశాలల చెస్‌ పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో 11, మహిళల విభాగంలో ఏడు కళాశాలలు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో ప్రథమస్థానం కానూరు వీఆర్‌ సిద్ధార్థ జట్టు, ద్వితీయ స్థానంలో విజయవాడ పీఎస్‌సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, తృతీయ స్థానంలో కానూరు పీవీపీ సిద్ధార్థ, ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీలు సంయుక్తంగా గెలిచాయి. మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ జట్టు, ద్వితీయ స్థానంలో కానూరు పీవీపీ సిద్ధార్థ జట్టు, తృతీయ స్థానంలో ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీ జట్టు, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్‌ జట్లు సంయుక్తంగా గెలిచాయి. గెలిచిన జట్లకు శనివారం పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొండపల్లి శివాజీబాబు బహుమతులు ప్రదానం చేశారు.

మహిళల పోటీల్లో విజేత గుడ్లవల్లేరు జట్టు

పురుషుల పోటీల్లో విజేత సిద్ధార్థ జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement